Banner Image

ప్రస్తుతం-2000

2010 సంవత్సరం- ఎస్ఆర్కె నేరోలాక్ 2006కు బ్రాండ్ అంబాసిడరుగా మారారు. జిఎన్పిఎల్, కన్సాయ్ నేరోలాక్ గా పేరు పొందింది. 2004-2006, లోట్ మరియు జైన్పూర్ ఫ్యాక్టరీలు గ్రీన్‌టెక్ సేఫ్టీ అవార్డ్ బంగారు, రజత పతకాలు పొందాయి. ఈ ప్లాంటులు OHSAS18001సర్టిఫికేషన్ కూడా పొందాయి. శ్రీ అమితాబ్ బచ్చన్ నేరోలాక్ బ్రాండుపై దృష్టిపెట్టేందుకు బ్రాండ్ అంబాసిడరుగా సంతకం చేశారు. ఆకాంక్ష ఫౌండేషనుతో కలిసి నిరుపేద చిన్నారుల సంక్షేమానికి చర్యలు తీసుకోబడ్డాయి.

Banner Image

2000-1991

2000 నాటికి, కన్సాయ్ పెయింట్స్ ద్వారా ఫోర్బ్స్ గోకాక్ మరియు దాని అనుబంధ సంస్థల్లోని పూర్తి వాటాను పొందబడి, ఈ కంపెనీ కన్సాయ్ పెయింట్స్కు అనుబంధ సంస్థగా 1999లో మారింది. ప్రస్తుతం ఈ సంస్థలోని మొత్తం ఈక్విటీలో కన్సాయ్ పెయింట్స్ వాటా 64.52% గా ఉంది. “జబ్ ఘర్ కి రౌనక్ బధానీ హో’’ అనే నేరోలాక్ జింగిల్ ఎంతో పేరు తెచ్చుకుంది.

Banner Image

1990- 1981

1983లో బొంబాయి మరియు పూనేలలో నేరోలాక్ GNP101 ఆటో పెయింట్స్ ను ఆవిష్కరించింది. ఇది 24 ప్రాథమిక షేడ్లు, 12 మెటాలిక్ శ్రేణి, 12 ప్రకాశవంతమైన శ్రేణులలో ప్రారంభించబడింది. ఆటోమోటివ్ ప్రోడక్టుల కోసం 1986లో క్యాథోడిక్ ఎలెక్ట్రోడిపొజిషన్ ప్రైమర్ మరియు ఇతర అధునాతన కోటింగ్స్ కై జపాన్ కు చెందిన కన్సాయ్ పెయింట్స్ కంపెనీ లిమిటెడుతో GNPL, ఒసాకాలో టిఎఎకు సంతకం చేసింది. భారతదేశంలో ఈ సాంకేతికతను పరిచయం చేసిన తొలి సంస్థ GNPL.

Banner Image

1980- 1950

1970లో, సంస్థ యొక్క చిహ్నంగా గూడీ అనే స్మైలింగ్ టైగర్ (నవ్వుతున్న పులి) ఆవిష్కరించబడింది. 1957లో, సంస్థ యొక్క పేరు గుడ్లాస్ నేరోలాక్ పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చబడింది. సంస్థ యొక్క అత్యంత విజయవంతమైన ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ పేరును సంస్థ యొక్క పేరుగా పెట్టడం సముచితమని భావించి ఇలా చేయడం జరిగింది. 1968లో, ఈ సంస్థ పబ్లిక్ గా మారి ప్రైవేట్ అనే పదాన్ని తొలగించుకుంది. 1950లో, కంపెనీ యొక్క ప్రముఖ ప్రోడక్ట్ అయిన యాంటీ-గ్యాస్ వార్నిష్, ప్రధానంగా రక్షణ రంగంలో వినియోగించబడింది.

Banner Image

1920 తొలి నాళ్లలో

1930, బ్రిటన్‌లో, మూడు బ్రిటీష్ సంస్థలు విలీనమై గుడ్ లాస్ వాల్ మరియు లీడ్ ఇండస్ట్రీస్ గ్రూప్ లిమిటెడ్గా మారాయి. ఆ తర్వాత అది లీడ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (ఎల్ఐజి) లిమిటెడ్గా అవతరించింది. 1933 ఏప్రిల్లో, ఎల్ఐజి, లివర్‌పూల్, ఇంగ్లాండ్ ఈ కంపెనీని విలీనం చేసుకుని గుడ్‌లాస్ వాల్ (ఇండియా) లిమిటెడ్ గా పేరుపెట్టింది. అమెరికన్ పెయింట్ మరియు వార్నిష్ కంపెనీని అలెన్ బ్రదర్స్ అండ్ కో అనే ఇంగ్లీష్ సంస్థ కొన్నది. 1920 తొలి నాళ్లలో గహాగన్ పెయింట్ అండ్ వార్నిష్ కంపెనీ లిమిటెడ్గా అవతరించింది.

భాషలు

మా గురించి

1920లో, గహాగన్ పెయింట్స్ మరియు వార్నీష్ ముంబైలోని లోయర్ పారెల్ లో అస్తిత్వంలోకి వచ్చింది. ఒక శతాబ్ధం తర్వాత, ఈ పెయింటింగ్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విశ్వసించదగిన పెయింటింగ్ బ్రాండ్లలో ఒకటిగా, భారతదేశంలో రెండో అతిపెద్ద పెయింటింగ్ కంపెనీగా గొప్ప స్థానంలో కొనసాగుతోంది.

అత్యంత చిన్న స్థాయి కంపెనీ దశ నుండి అత్యంత పెద్దదిగా పరిగణించబడుతున్న కన్సాయ్ నేరోలాక్ గా మారడం వెనుక కథ ఏమిటి?

కష్టపడి పనిచేయడం మరియు ఉన్నత స్థానాన్ని అధిరోహించాలనే ఆశయమే దానికి కారణం. దీనికి కృతనిశ్చయం మరియు ధైర్యం కావాలి. అధైర్యపడని సృజనాత్మకత దిశగా కవాతు సాగించాలని దాని అర్థం. దీనికోసం ఎన్నో రిస్కులను తీసుకోవాల్సి ఉంటుంది, అవి విజయవంతమైనప్పుడు పొంగిపోవాలి, ఒకవేళ ఆ రిస్కులు పనిచేయకపోతే వాటిని విశ్లేషించుకుని మరింత మెరుగైన ప్రణాళిక రచించుకోవాలి. వినియోగదారు అవసరాలను కూలంకషంగా అర్థంచేసుకోవడంతో పాటు వ్యాపార వాతావరణంలో మరింత ఒదిగిపోవాలి. మీ కార్మికశక్తిపై ఆర్&బి, సాంకేతికపరిజ్ఞానంలో పెట్టుబడిపెట్టాల్సిన అవసరం ఉంది. మరింత ముఖ్యంగా, ప్రోడక్టు పట్ల చెరిగిపోని నమ్మకం, స్థిరమైన అభిమానం దీనికి అవసరం.

ఇవన్నీ ఉన్నందుకే, కన్సాయ్ నేరోలాక్ కంపెనీ భారతదేశంలో రెండో అత్యంత పెద్ద కోటింగ్ సంస్థగానూ మరియు పారిశ్రామిక కోటింగ్ రంగంలో మార్కెట్ లీడరుగా మనగలుగుతోంది.

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి