భాషలు

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
సమర్పించండి

కెరీర్ ఆప్షన్స్

మేము ప్రతి సంవత్సరం అనేక మేనేజ్మెంట్ టెక్నికల్ / ఇంజనీరింగ్ సంస్థలు నుండి యువ మేనేజ్మెంట్ పోస్ట్‌గ్రాడ్యుయేట్లను నియమిస్తాము.ఎంపిక ప్రక్రియ గ్రూప్ చర్చలు, ఆప్టిట్యూడ్ పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూలను కలిగి ఉంటుంది. ఒక నెల కాలపు వివరణాత్మక ప్రేరణ కార్యక్రమం తరువాత, ట్రైనీలు ఒక సంవత్సరం ఉద్యోగ శిక్షణ ఉద్యోగబాధ్యతలను నిర్వహిస్తూ నేర్చుకుంటారు. వారి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వారు పనిచేసే ప్రొఫైల్స్‌లోకి చేర్చుకోబడతారు. నెరొలాక్‌లో పనితీరు ధోరణి చాలా బలంగా ఉంటుంది, పరస్పర ప్రయోజనం కోసం వారిని సమర్థవంతంగా దోహదపరుస్తుంది.

సీనియర్ మేనేజ్మెంట్ టీం సభ్యులలో చాలామంది తమ కెరీర్లను మేనేజ్మెంట్ ట్రెయినీస్‌గా ప్రారంభించారు అలాగే సంస్థలో ఉన్నత స్థానాలకు ఎదిగారు .

క్యాంపస్ కొల్లాబరేషన్

మా క్యాంపస్ సహకార చొరవ ద్వారా, నెరోలాక్‌లో మేము విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ సమాజానికి దోహదం పడటంలో కట్టుబడి ఉన్నాము. hrd@nerolac.com మాకు రాయండి మరియు అసోసియేట్ కండి.

కెరీర్ ఎంపిక

మేనేజర్ ట్రైనీస్‌తో పాటు ఏ స్థాయిలోనో నెరోలాక్‌లో చేరవచ్చు. ఈ క్రింది విధులు మాతో కలిసి పనిచేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము:

డెకొరేటివ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ – ప్రముఖమైన విశ్వవిద్యాలయాల నుండి బాచిలర్ డిగ్రీ మరియు మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అందులో మార్కెటింగ్ స్పెషలిజషన్ చేసిఉండాలి. సేల్స్ లేదా కన్స్యూమర్ డ్యూరబుల్స్, లుబ్రికంట్స్ పెయింట్స్ లేదా సంబంధిత ఇండస్ట్రీ లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

ఇండస్ట్రియల్ అండ్ మార్కెటింగ్ సేల్స్ – ప్రముఖమైన విశ్వవిద్యాలయాల నుండి విజ్ఞానశాస్త్రం లేదా ఇంజనీరింగ్ డిగ్రీ మరియు మార్కెటింగ్లో స్పెషలైజేషన్తో మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. పారిశ్రామిక రంగంలో 2 సంవత్సరాల అనుభవం - ఆటో / ఆటో యాన్సిలరీస్ లేదా ఓ.ఈ .ఎం కంపెనీలలో అమ్మకాలు / సాంకేతిక సేవలు/ బి టు బి సేల్స్.

పరిశోధన మరియు అభివృద్ధి – మేము నిరంతరం మా ఓ. ఈ .ఎం మరియు ఇతర వినియోగదారులకు ఉత్పత్తులు, ప్రక్రియలు, సాంకేతికత, సాంకేతిక సేవ మరియు మద్దతుపై పరిశోధన చేస్తాము.మేము కొత్త రంగులు మరియు షేడ్స్ ని అభివృద్ధి చేస్తాము. మేము జపనీయుల టెక్నాలజీ ద్వారా సమకూర్చబడిన ప్రపంచ స్థాయి ప్రయోగశాలని కలిగి ఉన్నాము. మేము పెయింట్ టెక్నాలజీ, రసాయన ఇంజనీరింగ్ మరియు సంబంధిత అనుభవంతో సంబంధిత విషయాలలో విద్యావిషయక అర్హతలు కలిగిన వ్యక్తుల కోసం వెతుకుతున్నాము.

ఫైనాన్స్ / అకౌంట్స్ / కంపెనీ సెక్రెటరీ – మీరు ఈ అవకాశాల కోసం చూస్తున్నటైతే , మీరు కనీసం 2 సంవత్సరాల అనుభవంతో ఫైనాన్స్ లో సి.ఏ /సి.ఎస్ లేదా ఎం.బి.ఏ చేసి ఉండాలి.

కాస్టింగ్ - ఐ.సి.డబ్ల్యూ.ఏ తో పాటు, మీకు రసాయన ప్రక్రియ పరిశ్రమలో కాస్టింగ్ లో కొంత అనుభవం ఉంటే మీరు మా అవసరానికి తగినవారు.

తయారీ / సెంట్రల్ ఇంజనీరింగ్ – మాకు బవాల్, జైన్పూర్, చెన్నై, లోట్ & హోసూర్ వద్ద ప్లాంట్లు ఉన్నాయి. మీరు ఒకవేళ కెమిస్ట్రీ, పెయింట్స్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు మేనిఫ్యాక్చరింగ్ లేదా ప్లాంట్ ఇంజనీరింగ్ లో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి బ్యాచ్లర్ డిగ్రీ ఉంటే, మీరు ప్రొడక్షన్ మరియు ఇంజనీరింగ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సప్లై చైన్ / మెటీరియల్స్ / ఏ. పి . ఓ / పర్చేజ్ – సప్లై చైన్, మెటీరియల్స్ మేనేజ్మెంట్ లో ఎం.బి.ఏ మరియు ఇంజనీరింగ్ కలిగి సప్లై చైన్ లేదు మెటీరియల్స్ మేనేజ్మెంట్ లో అనుభవం ఉన్నవారికి సబంధిత రంగాలలో అవకాశాలు కలవు. ఇంజనీరింగ్ డిగ్రీ మరియు ఏ.పి .ఓ అడ్మినిస్ట్రేషన్ లో అనుభవం కూడా మా అవసరానికి సరిపోతుంది

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఐ .టి సపోర్ట్ – ఎస్. ఏ .పి ఈ. సి.సి 6.0 అప్గ్రేడ్ ద్వారా ఎస్.డి, ఎం.ఎం, పి .పి, ఎఫ్.ఎస్.సి.ఎం, జి.ఆర్.సి. ఈ.ఎహ్.ఎస్ డేటా వేర్‌హౌసింగ్ మరియు ఉద్యోగుల పోర్టల్ (జ్ఞాన నిర్వహణ మరియు కార్య నిర్వహణ కోసం) వంటి వివిధ ఎస్. ఏ .పి మాడ్యూల్స్‌కి వివిధ అవకాశాలు దారితీశాయి.

హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మరియు డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ - కార్పోరేట్ ఆఫీస్ లేదా ఏదైనా ప్లాంట్ లో ఉద్యోగాలు కోసం మిమ్మల్ని పరిగణించవచ్చు . హెచ్ . ఆర్ / పర్సనల్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా తోపాటు మీకు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.