భాషలు

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
సమర్పించండి

విఓసి అంటే ఏమిటి?

ఒక ఇంటికి ఇటీవలే పెయింట్ వేశారని దాని నుండి వచ్చే వాసన ద్వారా మీరు కనిపెట్టవచ్చు. ఇంటిని అందంగా ఉంచుతూనే, దాని నుండి ఉద్భవించే ఉపఉత్పత్తే విఓసి.

విఓసి అనేది గాలిలోకి కలిసిపోయే ఒక కార్బన్-గల కాంపౌండ్. అది గాలిలో కలిసినప్పుడు, ఇతర మూలకాలతో కలిసి ఓజోన్ సృష్టిస్తుంది, దీని వల్ల కాలుష్యం ఏర్పడి శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, మంట, కళ్లలో నీరు తిరగడం, అలసట లాంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కొన్ని రకాల విఓసీల ద్వారా కేన్సర్ మరియు కిడ్నీ/లివర్ కు నష్టం కలిగించే లక్షణాలు కనిపిస్తాయి.

రంగులు పొడిబారుతున్నప్పుడు, హానికారక విఓసీలు గాలిలోకి అధిక స్థాయిలో విడుదలవుతాయి. ఇండోర్ విఓసి స్థాయిలు బయటి విఓసి స్థాయిల కంటే 10 రెట్ల అధికంగా ఉంటాయి, అలాగే పెయింట్ వేసిన వెంటనే 1,000 రెట్లు మరింత అధికంగా ఉంటాయి. పెయింట్ వేసిన వెంటనే విడుదలయ్యే విఓసి స్థాయిలు అత్యధిక స్థాయిలోనే ఉన్నప్పటికీ, అవి కొన్ని సంవత్సరాల పాటు విడుదలవుతూనే ఉంటాయి. వాస్తవానికి, కేవలం 50శాతం విఓసీలు మాత్రమే తొలి ఏడాదిలో విడుదలవుతాయి.

ఇది వినడానికి భయానకంగా ఉన్నా, నేరోలాక్ వద్ద పరిష్కారం ఉంది. 2011లో, నేరోలాక్ ఈ రంగంలో మార్గదర్శిగా మారి,దాదాపు సున్నా శాతం విఓసి గల ప్రీమియం శ్రేణి ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఎమల్షన్లను తయారుచేసింది. ఈ ఎమల్షన్లను తయారుచేసిన తొలి భారతీయ కంపెనీ నేరోలాక్. అతి తక్కువ స్థాయిల విఓసీలతో, నేరోలాక్ పెయింట్స్ వినియోగానికి అత్యంత సురక్షితం మరియు ఆరోగ్యకరమైన ఇల్లు అనే తత్వానికి సరిగ్గా సరిపోతుంది.

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి