భాషలు

సాంకేతిక గైడ్

సాధ్యమైనంత ఎక్కువ ఫిల్మ్ అప్పియరెన్స్ పొందడానికి ఉపరితలాన్ని సరైన రీతిలో తయారుచేయడం అత్యంత ముఖ్యం. కాబట్టి మేము, స్టీల్ ప్లాంటులకు ముందస్తు ఉపరితల ట్రీట్మెంట్, ప్యాబ్రికెటెడ్ స్టీల్ మరియు మరమ్మతు పెయింట్ అప్లికేషన్ కోసం ద్వితీయ ఉపరితల ట్రీట్మెంట్ గురించి వివరించాము.

స్టీల్ ప్లాంట్స్ కోసం ఈ దిగువ ప్రారంభ ఉపరితల ట్రీట్మెంట్ వర్తించబడాలి.

 • పరిశుభ్రమైన పాత వస్త్రాలు లేదా బ్రష్షులను ద్రావకంలో తడిపి స్టీలును తుడవడం ద్వారా నూనె, జిడ్డును తప్పక తొలగించాలి. స్టీలుకు బాగా అతుక్కుపోయిన వాటిని గీకడం ద్వారా లేదా ద్రావకంతో శుభ్రం చేయడం ద్వారా తొలగించాలి.
 • స్టీల్ ఉపరితలాలపై గల సల్ఫేట్స్ లాంటి తుప్పు లవణాలు తాజా నీటితో కడగాలి. నీరు మరియు తేమ పోయేలా పొడి వస్త్రాలతో తుడవాలి లేదా వేడి గాలిని ప్రసరింపచేయడం ద్వారా ఆరబెట్టాలి.
 • ISO ప్రమాణాన్ని చేరుకునేందుకు అన్ని మిల్ స్కేల్, తుప్పు, తుప్పు-స్కేల్, పెయింట్ మార్కులు లేదా స్టీల్ కు సంబంధం లేని పదార్ధాలను గ్రిట్ లేదా శాండ్ బ్లాస్టింగ్ ద్వారా తీసివేయాలి.
 • ప్రైమర్ అప్లై చేయబడడానికి ముందు, దుమ్ము, ఇసుక వ్యర్థాలు, క్రష్ చేయబడిన స్టీల్ షాట్ లేదా గ్రిట్ మరియు ఇతర అన్ని కలుషితాలు ఉపరితలంపై నుండి వాక్యూమ్ క్లీనర్ లేదా ఎయిర్ బ్లోవర్ ద్వారా తొలగించాలి.

లోపం గలిగిన లేదా పాడయిన ప్రాంతాల బ్లాస్టింగ్ ద్వారా లేదా పవర్ టూల్ తో తప్పక శుభ్రం చేయబడాలి. వరుస కోట్స్ అప్లై చేయడానికి ముందు ఉపరితలంపై జిడ్డును తొలగించడం మరియు కడగడం లాంటివి అవసరపడవచ్చు. దానికోసం, ఈ దిగువ పద్ధతులు అనుసరించండి:

 • గట్టి ఫైబర్ లేదా వైర్ బ్రష్ లేదా రెండింటి సమ్మేళనంతో తుప్పు లవణాలు, తెల్లని పదార్ధాలు, మచ్చలు, మట్టి లేదా ఇతర కలుషితాలు మరియు స్టీలుకు చెందని పదార్థాలను బ్రష్ చేసి తీసివేయాలి.
 • ద్రవాలను ఉపయోగించి నూనె మరియు జిడ్డు తప్పక తీసియేయాలి.
 • వెల్డ్ ఫ్లక్స్ స్లాగ్స్, వెల్డ్ మెటల్ స్పాటర్స్, వెల్డ్ ఫ్లక్స్ ఫ్యూమ్ పదార్ధాలు, తుప్పుపట్టిన మరియు వెల్డింగ్ చేసిన ప్రాంతాల్లోని పాడయిపోయిన పెయింట్ ఫిల్మ్స్ తీసివేయడానికి ఒక బ్లాస్ట్ క్లీనర్ లేదా పవర్ టూల్ వాడాలి.
 • దుమ్ము, ఇసుక అవశేషాలు మరియు ఇతర కలుషితాలను తీసివేయడానికి వాక్యూమ్ క్లీనర్ వాడండి.

ఉపరితలాన్ని తయారుచేసే ప్రక్రియ యొక్క నాణ్యతపైనే పెయింట్ ఫిల్మ్స్ యొక్క సామర్థ్యం తీవ్రంగా ఆధారపడి ఉంటుంది. అందుకే, పెయింటింగ్ కు ముందే దీనికి సంబంధించిన విధానం మరియు ఉపరితలం తయారీ రకం రెండింటినీ సరైన రీతిలో ఎంచుకోవడం ప్రధానం. ముందస్తు-ట్రీట్మెంట్ విధానాన్ని ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఇక్కడ వివరించబడ్డాయి.:

ఉపరితల భౌతిక మరియు రసాయన పరిశుభ్రత

 • ఉపరితల పరిస్థితులు
 • ఉపరితల ప్రొఫైల్
 • పెయింట్ యొక్క లక్షణాలు
 • భద్రతా అంశాలు
 • పర్యావరణ ఒత్తిళ్లు
 • లబ్యమయ్యే సాధనాల రకం
 • గతంలో అమలుచేసిన ట్రీట్మెంట్స్ రకం

ముందస్తు-ట్రీట్మెంట్ రకం మరియు పెయింట్ సిస్టమ్స్ లను నిర్ణయించాల్సి వచ్చినప్పుడు, పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుందని అన్ని వేళలా మనసులో ఉంచుకోవాలి.  

విధానం ఫలితం
బ్లాస్ట్ క్లీనింగ్ అనువైనది
మెకానికల్ వైర్-బ్రష్షింగ్ ఆమోదనీయం
మెకానికల్ డిస్క్-శాండింగ్ ఆమోదనీయం
నీడిల్ చిప్పింగ్ సరయినది
మెకానికల్ స్క్రాపింగ్ సరయినది
హ్యాండ్ బ్రష్షింగ్ పూర్
హ్యాండ్ స్క్రాపింగ్ పూర్
వాటర్-జెట్ క్లీనింగ్ ఆమోదనీయం
సిస్టమ్ (SSPC) (NACE) (ISO) BS:4232-67
సాల్వెంట్ క్లీనింగ్ SSPC-SP 1 - - -
హ్యాండ్ టూల్ క్లీనింగ్ SSPC-SP 2 - St-2(దాదాపు) -
పవర్ టూల్ క్లీనింగ్ SSPC-SP 3 - - -
ఫేమ్ క్లీనింగ్ SSPC-SP 4 - - -
వైట్ మెటల్ బ్లాస్టింగ్ SSPC-SP 5 NACE 1 Sa-3 1స్ట్ క్వాలిటీ
కమర్షియల్ బ్లాస్టింగ్ SSPC-SP 6 NACE 3 Sa-2 3ర్డ్ క్వాలిటీ
బ్రష్ ఆఫ్ బ్లాస్టింగ్ SSPC-SP 7 NACE 4 Sa-2 -
పిక్లింగ్ SSPC-SP 8 - - -
వెదరింగ్ అండ్ బ్లాస్టింగ్ SSPC-SP 9 - - -
సమీపంలో వైట్ మెటల్ బ్లాస్టింగ్ SSPC-SP 10 NACE 2 Sa-3 2డ్ క్వాలిటీ

 

*స్టీల్ నిర్మాణ పెయింటింగ్ కౌన్సిల్ నిర్దేశం
తుప్పు నిరోధక ఇంజినీర్ల జాతీయ సంఘం నిర్దేశం
స్వీడన్ దేశ ప్రమాణాలు
బ్రిటన్ ప్రమాణాల నిర్దేశం

అల్యూమీనియం/టిన్/కాపర్/బ్రాస్ మరియు ఇతర ఇనుము రహిత లోహాలు

 • ఉపరితలం తప్పక పొడిగా శుభ్రంగా ఉండాలి.
 • పైకి కనిపించే నూనె/జిడ్డు తప్పక తొలగించబడాలి.
 • శుభ్రపరిచిన ఉపరితలం ఆరబెట్టబడాలి లేదా తక్కువ ఒత్తిడి మరియు లోహరహిత అబ్రాసివ్స్ ఉపయోగించి స్వీప్-బ్లాస్ట్ చేయాలి మరియు ఆ తర్వాత వాష్ ప్రైమరుతో కోట్ ప్రైమ్ చేయాలి.  


గాల్వనైజ్ చేసిన స్టీల్

 • ఎలాంటి నూనె/జిడ్డునైనా తొలగించే డీగ్రీజింగ్.
 • అధిక-ఒత్తిడి, తాజా నీటితో కడగడం ద్వారా ఏ తెల్లని జింక్ తుప్పు ప్రోడక్టులు తీసివేయబడాలి.
 • విలీనపరచగల జింక్ సాల్ట్స్ తొలగించేందుకు నీటితో కడగడం సిఫారసు చేయబడుతుంది.


స్టెయిన్ లెస్ స్టీల్

 • స్టెయిన్ లెస్ స్టీల్ ఉపరితలాలకు కోటింగ్ ముందు ఎటువంటి ప్రత్యేకించబడిన ముందస్తు ఉపరితల ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఈ ఉపరితలాలు నూనె, జిడ్డు, మురికి మరియు ఇతర సంబంధంలేని పదార్థాలను ఇవి కలిగి ఉండరాదు.
 • మంచి కోటింగ్ సంశ్లేషణ కోసం స్టెయిన్ లెస్ స్టీల్ పై ఉపరితల ప్రొఫైల్ వృద్ధిచేయడం అనేది అధికంగా సిఫారసు చేయబడుతోంది.
 • దాదాపు అన్ని కోటింగ్స్ సిస్టంలకు 1.5 మరియు 3.0 మిల్స్ మధ్య ప్రొఫైల్ లోతు సూచించబడుతుంది.


కాంక్రీట్ మరియు మాసోన్రీ ఉపరితలాలు

కొత్త కాంక్రీట్ ఉపరితలం:

 • కోటింగ్ కు ముందు కనీసం 30 రోజులపాటు క్యూర్ కు అనుమతించాలి.
 • కాంక్రీట్/మాసోన్రీ యొక్క తేమ కంటెంట్ తప్పక 6% కన్నా తక్కువ ఉండాలి.
 • విశాల ప్రాంతాలు మరియు తీవ్రమైన ప్రభావానికి లోనయ్యే పరిస్థితులున్న సమయంలో, ఉపరితలం తేలికపాటి బ్లాస్టింగుతో సిద్ధం చేయాలి. బ్లాస్టింగ్ వాస్తవికం కాని తక్కువ ప్రమాదకర ప్రాంతాల్లో, పలచబరిచిన హైడ్రాలిక్ యాసిడ్ తో ట్రీట్ చేసి, లైటెన్సును తొలగించడానికి వైర్ బ్రషింగ్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
 • ప్రైమర్ అప్లై చేయడానికి ముందు ఉపరితలం చక్కగా ఆరేలా జాగ్రత్తపడాలి.

పాత కాంక్రీట్ ఉపరితలం:

 • గ్రీజ్, నూనె లాంటి ఉపరితల కలుషితాలను తొలగించేందుకు, ద్రావకాలతో లేదా 10% కాస్టిక్ మిశ్రమం&##3108;ో తుడవండి.
 • ఉపరితలం తప్పక తేలికపాటి బ్లాస్టింగుతో సిద్ధపరచబడాలి. బ్లాస్టింగ్ ఆచరణసాధ్యం కాకపోతే, మంచి ప్రొఫైల్ పొందడం కోసం హెచ్.సి.ఎల్ తో విలీనపరచడం ద్వారా ఉపరితలాన్ని చెక్కండి.
 • నీటితో కడిగి యాసిడ్ మరియు కలుషితాలను తీసివేయండి.
 • యాసిడ్ ద్రావకం ఉపరితలంపై మరియు జాయింట్లపై మిగిలిపోకుండా జాగ్రత్తపడండి.
 • ప్రైమర్ వేయడానికి ముందు ఉపరితలాన్ని చక్కగా ఆరేలా చూడండి.

కలప ఉపరితలాలు:

 • ఒకటి లేదా మరిన్ని కెమికల్ క్లీనింగ్ విధానాలతో దుమ్ము/గ్రీజ్/నూనె తొలగించాలి.
 • ముడులు, మేకులు, రంధ్రాలు, పగుళ్లు, లాంటివి సరైన ఫిల్లర్ కాంపౌండుతో నింపబడాలి, ఒకవేళ వదులుగా గల కోటింగ్స్ ఉంటే వాటిని గీకి తొలగించండి, మరియు ఉపరితలాన్ని సమానంగా శాండ్ చేయాలి.
 • తెల్లని ఉపరితలాలకు కోటింగ్ వేసేముందు వాటిని తప్పక శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి