Banner Image

ప్రస్తుతం-2000

2010 సంవత్సరం- ఎస్ఆర్కె నేరోలాక్ 2006కు బ్రాండ్ అంబాసిడరుగా మారారు. జిఎన్పిఎల్, కన్సాయ్ నేరోలాక్ గా పేరు పొందింది. 2004-2006, లోట్ మరియు జైన్పూర్ ఫ్యాక్టరీలు గ్రీన్‌టెక్ సేఫ్టీ అవార్డ్ బంగారు, రజత పతకాలు పొందాయి. ఈ ప్లాంటులు OHSAS18001సర్టిఫికేషన్ కూడా పొందాయి. శ్రీ అమితాబ్ బచ్చన్ నేరోలాక్ బ్రాండుపై దృష్టిపెట్టేందుకు బ్రాండ్ అంబాసిడరుగా సంతకం చేశారు. ఆకాంక్ష ఫౌండేషనుతో కలిసి నిరుపేద చిన్నారుల సంక్షేమానికి చర్యలు తీసుకోబడ్డాయి.

Banner Image

2000-1991

2000 నాటికి, కన్సాయ్ పెయింట్స్ ద్వారా ఫోర్బ్స్ గోకాక్ మరియు దాని అనుబంధ సంస్థల్లోని పూర్తి వాటాను పొందబడి, ఈ కంపెనీ కన్సాయ్ పెయింట్స్కు అనుబంధ సంస్థగా 1999లో మారింది. ప్రస్తుతం ఈ సంస్థలోని మొత్తం ఈక్విటీలో కన్సాయ్ పెయింట్స్ వాటా 64.52% గా ఉంది. “జబ్ ఘర్ కి రౌనక్ బధానీ హో’’ అనే నేరోలాక్ జింగిల్ ఎంతో పేరు తెచ్చుకుంది.

Banner Image

1990- 1981

1983లో బొంబాయి మరియు పూనేలలో నేరోలాక్ GNP101 ఆటో పెయింట్స్ ను ఆవిష్కరించింది. ఇది 24 ప్రాథమిక షేడ్లు, 12 మెటాలిక్ శ్రేణి, 12 ప్రకాశవంతమైన శ్రేణులలో ప్రారంభించబడింది. ఆటోమోటివ్ ప్రోడక్టుల కోసం 1986లో క్యాథోడిక్ ఎలెక్ట్రోడిపొజిషన్ ప్రైమర్ మరియు ఇతర అధునాతన కోటింగ్స్ కై జపాన్ కు చెందిన కన్సాయ్ పెయింట్స్ కంపెనీ లిమిటెడుతో GNPL, ఒసాకాలో టిఎఎకు సంతకం చేసింది. భారతదేశంలో ఈ సాంకేతికతను పరిచయం చేసిన తొలి సంస్థ GNPL.

Banner Image

1980- 1950

1970లో, సంస్థ యొక్క చిహ్నంగా గూడీ అనే స్మైలింగ్ టైగర్ (నవ్వుతున్న పులి) ఆవిష్కరించబడింది. 1957లో, సంస్థ యొక్క పేరు గుడ్లాస్ నేరోలాక్ పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చబడింది. సంస్థ యొక్క అత్యంత విజయవంతమైన ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ పేరును సంస్థ యొక్క పేరుగా పెట్టడం సముచితమని భావించి ఇలా చేయడం జరిగింది. 1968లో, ఈ సంస్థ పబ్లిక్ గా మారి ప్రైవేట్ అనే పదాన్ని తొలగించుకుంది. 1950లో, కంపెనీ యొక్క ప్రముఖ ప్రోడక్ట్ అయిన యాంటీ-గ్యాస్ వార్నిష్, ప్రధానంగా రక్షణ రంగంలో వినియోగించబడింది.

Banner Image

1920 తొలి నాళ్లలో

1930, బ్రిటన్‌లో, మూడు బ్రిటీష్ సంస్థలు విలీనమై గుడ్ లాస్ వాల్ మరియు లీడ్ ఇండస్ట్రీస్ గ్రూప్ లిమిటెడ్గా మారాయి. ఆ తర్వాత అది లీడ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (ఎల్ఐజి) లిమిటెడ్గా అవతరించింది. 1933 ఏప్రిల్లో, ఎల్ఐజి, లివర్‌పూల్, ఇంగ్లాండ్ ఈ కంపెనీని విలీనం చేసుకుని గుడ్‌లాస్ వాల్ (ఇండియా) లిమిటెడ్ గా పేరుపెట్టింది. అమెరికన్ పెయింట్ మరియు వార్నిష్ కంపెనీని అలెన్ బ్రదర్స్ అండ్ కో అనే ఇంగ్లీష్ సంస్థ కొన్నది. 1920 తొలి నాళ్లలో గహాగన్ పెయింట్ అండ్ వార్నిష్ కంపెనీ లిమిటెడ్గా అవతరించింది.

భాషలు

మా వ్యవస్థలు

యావత్ దేశం డిజిటలీకరణ వైపుగా సాగిపోతున్న తరుణంలో, మా కంపెనీ కూడా తన డిజిటల్ మౌలిక వనరుల వ్యవస్థలో పెట్టుబడిపెట్టాల్సిన అవసరం ఉంది. అభివృద్ధికి డిజిటలీకరణ ఎంతగానో తోడ్పడుతూ, తగు వృద్ధిఫలాలను ఇస్తూ నేటి పోటీ ప్రపంచంలో ముఖ్యమైన అంశంగా నిలిచింది. ఇదే దూరదృష్టితో 2000 ఫిబ్రవరిలో, నేరోలాక్ ఎస్ఎపి ఆర్/3 సొల్యూషన్‌లో పెట్టుబడి పెట్టి, దానిని అమలు చేయడం ద్వారా ఒక ఫంక్షన్-ఆధారిత లెగసీ వ్యవస్థ నుండి ప్రోసెస్-ఆధారిత వ్యవస్థీకృత వ్యవస్థకు మారింది. అలాగే ఎస్ఎపి ఆర్/3, ఎస్ఎపి సప్లై చెయిన్ మరియు మద్దతు గల డీలర్ మరియు వెండార్ పోర్టల్స్ లాంటి ముఖ్యమైన ఎస్ఎపి అప్లికేషన్ల ద్వారా డిజిటల్ అభివృద్ధిలో ముందంజలో ఉండేందుకు మా సంస్థ పలు చర్యలు తీసుకొంది.

నేరోలాక్ పారిశ్రామిక వనరుల ప్రణాళిక సాధనాలను నిరంతరం ఉపయోగించడంలో కొనసాగుతూనే వాటిని తాజా వెర్షన్లకు నవీకరించుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం గల ఎస్ఎపి అప్లికేషన్లు అన్నీ తాజా వెర్షన్ కలిగి, ఆర్థికం, మార్కెటింగ్ మరియు వినియోగదారు సంబంధాలు, ఉత్పాదకత, కార్పోరేట్ గవర్నెన్స్, బిజినెస్ అనలిటిక్స్, మొబైల్ మరియు వెండార్ పోర్టల్స్ లాంటి అంశాల్లో అత్యాధునిక పరిష్కార విధానాలను అనుసరించడం జరుగుతోంది.

ఐటి డిపార్టుమెంట్లోని ఈ దూరదృష్టే మా కంపెనీని చాలా కాలం క్రితమే విజయతీరాలకు చేర్చింది అలాగే తన భాగస్వాముల పట్ల పారదర్శకతతో వ్యవహరించేలా చేస్తోంది.

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి