Banner Image

ప్రస్తుతం-2000

2010 సంవత్సరం- ఎస్ఆర్కె నేరోలాక్ 2006కు బ్రాండ్ అంబాసిడరుగా మారారు. జిఎన్పిఎల్, కన్సాయ్ నేరోలాక్ గా పేరు పొందింది. 2004-2006, లోట్ మరియు జైన్పూర్ ఫ్యాక్టరీలు గ్రీన్‌టెక్ సేఫ్టీ అవార్డ్ బంగారు, రజత పతకాలు పొందాయి. ఈ ప్లాంటులు OHSAS18001సర్టిఫికేషన్ కూడా పొందాయి. శ్రీ అమితాబ్ బచ్చన్ నేరోలాక్ బ్రాండుపై దృష్టిపెట్టేందుకు బ్రాండ్ అంబాసిడరుగా సంతకం చేశారు. ఆకాంక్ష ఫౌండేషనుతో కలిసి నిరుపేద చిన్నారుల సంక్షేమానికి చర్యలు తీసుకోబడ్డాయి.

Banner Image

2000-1991

2000 నాటికి, కన్సాయ్ పెయింట్స్ ద్వారా ఫోర్బ్స్ గోకాక్ మరియు దాని అనుబంధ సంస్థల్లోని పూర్తి వాటాను పొందబడి, ఈ కంపెనీ కన్సాయ్ పెయింట్స్కు అనుబంధ సంస్థగా 1999లో మారింది. ప్రస్తుతం ఈ సంస్థలోని మొత్తం ఈక్విటీలో కన్సాయ్ పెయింట్స్ వాటా 64.52% గా ఉంది. “జబ్ ఘర్ కి రౌనక్ బధానీ హో’’ అనే నేరోలాక్ జింగిల్ ఎంతో పేరు తెచ్చుకుంది.

Banner Image

1990- 1981

1983లో బొంబాయి మరియు పూనేలలో నేరోలాక్ GNP101 ఆటో పెయింట్స్ ను ఆవిష్కరించింది. ఇది 24 ప్రాథమిక షేడ్లు, 12 మెటాలిక్ శ్రేణి, 12 ప్రకాశవంతమైన శ్రేణులలో ప్రారంభించబడింది. ఆటోమోటివ్ ప్రోడక్టుల కోసం 1986లో క్యాథోడిక్ ఎలెక్ట్రోడిపొజిషన్ ప్రైమర్ మరియు ఇతర అధునాతన కోటింగ్స్ కై జపాన్ కు చెందిన కన్సాయ్ పెయింట్స్ కంపెనీ లిమిటెడుతో GNPL, ఒసాకాలో టిఎఎకు సంతకం చేసింది. భారతదేశంలో ఈ సాంకేతికతను పరిచయం చేసిన తొలి సంస్థ GNPL.

Banner Image

1980- 1950

1970లో, సంస్థ యొక్క చిహ్నంగా గూడీ అనే స్మైలింగ్ టైగర్ (నవ్వుతున్న పులి) ఆవిష్కరించబడింది. 1957లో, సంస్థ యొక్క పేరు గుడ్లాస్ నేరోలాక్ పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చబడింది. సంస్థ యొక్క అత్యంత విజయవంతమైన ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ పేరును సంస్థ యొక్క పేరుగా పెట్టడం సముచితమని భావించి ఇలా చేయడం జరిగింది. 1968లో, ఈ సంస్థ పబ్లిక్ గా మారి ప్రైవేట్ అనే పదాన్ని తొలగించుకుంది. 1950లో, కంపెనీ యొక్క ప్రముఖ ప్రోడక్ట్ అయిన యాంటీ-గ్యాస్ వార్నిష్, ప్రధానంగా రక్షణ రంగంలో వినియోగించబడింది.

Banner Image

1920 తొలి నాళ్లలో

1930, బ్రిటన్‌లో, మూడు బ్రిటీష్ సంస్థలు విలీనమై గుడ్ లాస్ వాల్ మరియు లీడ్ ఇండస్ట్రీస్ గ్రూప్ లిమిటెడ్గా మారాయి. ఆ తర్వాత అది లీడ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (ఎల్ఐజి) లిమిటెడ్గా అవతరించింది. 1933 ఏప్రిల్లో, ఎల్ఐజి, లివర్‌పూల్, ఇంగ్లాండ్ ఈ కంపెనీని విలీనం చేసుకుని గుడ్‌లాస్ వాల్ (ఇండియా) లిమిటెడ్ గా పేరుపెట్టింది. అమెరికన్ పెయింట్ మరియు వార్నిష్ కంపెనీని అలెన్ బ్రదర్స్ అండ్ కో అనే ఇంగ్లీష్ సంస్థ కొన్నది. 1920 తొలి నాళ్లలో గహాగన్ పెయింట్ అండ్ వార్నిష్ కంపెనీ లిమిటెడ్గా అవతరించింది.

భాషలు

స్థిరత్వం

కార్పోరేట్ సామాజిక బాధ్యత

సిఎస్ఆర్ ఫంక్షన్ మిషన్ & ఫిలాసఫీ – ఒక మంచి పొరుగువానిగా వ్యవహరిస్తూ సామాజికాభివృద్ధికి సానుకూల దృక్పథంతో సహకారం అందించడం, ఇతరులు కూడా ఒక మంచి కార్పోరేట్ పౌరునిగా అదే లక్ష్యం మరియు కరుణతో సామాజికాభివృద్ధిలో పాలుపంచుకునేలా చేయడం.

సిఎస్ఆర్ కంపెనీ విజన్ – సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానాలు, ప్రోడక్టులతోపాటు సాధారణ కార్యకలాపాలకు అవతల కార్యక్రమాలను ఉపయోగించి సామాజికాభివృద్ధికోసం పర్యావరణ, సామాజిక మరియు ఆర్థికాబివృద్ధికి అత్యంత క్రియాశీల బాధ్యతతో వ్యవహరించే కార్పోరేట్ గా ఉండటం.

సిఎస్ఆర్ కార్యకలాపాలు ఐదు చత్రాల కిందకు వచ్చేలా తీర్చిదిద్దబడ్డాయి, వాటి పేర్లు “జీవన మరియు నైపుణ్యాభివృద్ధి” (ఎస్బీఐ లాంటి వెలుపలి భాగస్వామితో కలిసి), గ్రామీణ/కమ్యూనిటీ అభివృద్ధి” “ముందస్తు ఆరోగ్య కార్యక్రమం మరియు పారిశుద్ధ్యం”, “విద్యను ప్రచారం చేయడం” మరియు “పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడటం”.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సహాయపడే శిక్షణలను అందించేందుకు కె.ఎన్.పి.ఎల్ చురుకుగా చొరవతీసుకుని ఒప్పిస్తుంది. అంతే కాకుండా ఈ కార్యక్రమాలు వృత్తినిపుణులు లేదా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా చేయడంతోపాటు దేశానికి అవసరమైన నైపుణ్యం గల ఉద్యోగులను అందుబాటులో ఉంచేలా తోడ్పడుతుంది.  

అలాగే, గ్రామీణ భారతంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటుచేయడం, మరుగుదొడ్లు, బస్ షెల్టర్లు, బోరు బావులను నిర్మించడం, విద్యా సంస్థలకు అవసరమైన నిధులను అందించి సహాయపడటం లాంటి సామాజికాభివృద్ధి కార్యక్రమాలను కె.ఎన్.పి.ఎల్ అమలుచేస్తోంది.

భారతదేశపు ఆర్థిక, సామాజిక, పర్యావరణాభివృద్ధికి మరియు సాంస్కృతిక పరిరక్షణకు క్షేత్ర స్థాయి నుండి సహాయపడడం ద్వారా, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల చిన్నా పెద్ద మార్గాల ద్వారా తోడ్పడేందుకు కె.ఎన్.పి.ఎల్ కట్టుబడి ఉంది.

కార్పోరేట్ సామాజిక బాధ్యత వివరాలను డౌన్లోడ్ చేయండి:

 

మన వాతావరణం

కన్సాయ్ నేరోలాక్ లో, మా కంపెనీ అభివృద్ధికి పర్యావరణమే ప్రధానం. ప్రపంచ వ్యాప్తంగాప్రకృతి వనరులు ధ్వంసమవుతున్న తరుణంలో, వాటి సంరక్షణకు పిలుపునిచ్చి, పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కలిగించడం అనేది ముఖ్యమైన అంశం. పర్యావరణాన్ని కాపాడటం అనేది ప్రతీ ఒక్క కంపెనీ యొక్క బాధ్యత మరియు మరింత ముఖ్యంగా తన సంస్థ కార్యకలాపాల్లో మరింత మెరుగైన పర్యావరణాన్ని నెలకొల్పడం ఆయా సంస్థల బాధ్యత. దీనిని మేము అత్యంత గట్టి బాధ్యతగా తీసుకున్నాము.

మా అన్ని ఉత్పత్తి ప్లాంటులు ISO-14001 సర్టిఫికేషన్ కలిగి ఉండి, మా సంస్థ యొక్క లక్ష్యమైన మెరుగైన పర్యావరణ పరిరక్షణను సాధించేందుకు సాయపడుతున్నాయి. రీసైకిలింగ్ ను ప్రోత్సహించడం ద్వారా ప్రకృతి వనరులను ప్రభావవంతంగా మరియు సమతుల్యంగా వాడేందుకు, మేము వాతావరణ వ్యవస్థ మెరుగుదలకై నిరంతరం కష్టపడుతూ మా సహకారం అందిస్తుంటాము. అంతేకాకుండా, మా భాగస్వాముల పట్ల మా బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహనను కలిగి ఉన్నాము, దాని ఫలితంగా, వార్షిక వాతావరణ నివేదికల రూపంలో వాతావరణ సమాచారాన్ని మా భాగస్వాములకు అందించేందుకు జాగ్రత్తపడుతుంటాము.

సీ నం. ప్లాంట్ టైప్ ఆఫ్ సర్టిఫికెట్ సర్టిఫై చేసిన వారు
1 లోట్ ISO/TS 16949:2009 BVQI
ISO 9001:2008 BVQI
ISO 14001:2004 BVQI
OHSAS 18001:2007 BVQI
2 బావాల్ ISO/TS 16949:2009 BVQI
ISO 14001:2004 BVQI
OHSAS 18001:2007 BVQI
3 జైన్పూర్ ISO/TS 16949:2009 Intertek
ISO 9001:2008 Intertek
ISO 14001:2004 Intertek
OHSAS 18001:2007 Intertek
4 హోసూర్ ISO/TS 16949:2009 BVQI
ISO 9001:2008 BVQI
ISO 14001:2004 BVQI
OHSAS 18001:2007 BVQI

Environment Information Disclosure

పర్యావరణ నివేదిక డౌన్లోడ్ చేయండి:

 

సస్టెయినబిలిటీ నివేదిక

సస్టెయినబిలిటీ నివేదిక డౌన్లోడ్ చేయండి:

SEND US YOUR QUERIES

మీ సందేహాలను మాకు పంపండి