భాషలు

Buy
X
Get in touch
 
1 Start 2 Complete
X
Get in touch
 
1 Start 2 Complete
Send OTP
సమర్పించండి

తరచూ అడిగే ప్రశ్నల విభాగం

ఇంట్లోని వాతావరణం ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది, మన గృహాల్లోని పరిస్థితులు పలు రకాల అనారోగ్యాలకు కారణమవుతాయి. గృహాల్లోని వాతావరణం చాలావరకు పలు సాధారణ అనారోగ్యాలకు కారణమవడంతోపాటు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరికి నష్టం చేకూర్చుతుంది.

చాలామంది గృహాల్లోనే అత్యధిక సమయం గడపడమే దానికి కారణం, మన గృహాల్లోనే పలు అనారోగ్యాలకు కారణమయ్యేలా చేసే చాలావరకు విషపదార్థాలు, ఇరిటెంట్లు, అలర్జీ కారకాలు, విషవాయువులు ఉంటాయి.

విఓసిలు అనేది గాలిలోకి కలిసిపోయే ఒక కార్బన్-గల కాంపౌండ్‌లు. అవి గాలిలో కలిసినప్పుడు, ఓజోన్‌ని సృష్టించడానికి ఇతర మూలకాలతో ప్రతిచర్య జరుపుతాయి, దీని వల్ల కాలుష్యం ఏర్పడి శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, మంట, కళ్లలో నీరు తిరగడం, అలసట లాంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కొన్ని రకాల విఓసీల ద్వారా కేన్సర్ మరియు కిడ్నీ/లివర్ కు నష్టం కలిగించే లక్షణాలు కనిపిస్తాయి.

పెయింట్లు, వార్నిష్ లు, గృహసంబంధిత క్లీనింగ్ ఏజెంట్లు, గ్లూ, ఇంక్స్ మరియు బిల్డింగ్ మెటీరియల్స్.

విఓసి వల్ల ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, అలర్జిక్ సమస్యలు, కళ్లలో నీరు తిరుగుడు, ముక్కు కారడం, ఎర్రబారిన కళ్లు, దగ్గు, గొంతులో మంట లాంటివి కలుగుతాయి. దాంతోపాటు చిన్నారుల్లో రోగనిరోధక వ్యవస్థను కూడా విఓసీలు బలహీనపరుస్తాయి.

VOC ఆందోళనలు ఒక శిశువుకు ప్రాణాంతకం కాగలవని మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి:

చిన్నారుల ఊపిరితిత్తులు ఇంకా ఎదిగేదశలోనే ఉండటం వల్ల పెద్దలతో పోలిస్తే మరింత బలహీనంగా ఉంటాయి. ఈ అభివృద్ధి దశలో, ఊపిరితిత్తుల కణజాలం సులభంగా దెబ్బతిని, పెద్దయిన తర్వాత కూడా కోలుకునే పరిస్థితి ఉండదు.

ఒక చిన్నారి యొక్క ఊపిరితిత్తుల పరిమాణం, గాలిలోని విషపదార్ధాల ప్రభావానికి సులువుగా గురయ్యేలా ఉంటుంది. ఎదిగినవారిలోని ఊపిరితిత్తులకు గాలిలోని అతి చిన్న మోతాదులోని కాలుష్యం కలిగించే సమస్య కన్నా, చిన్నారుల్లోని ఎదిగే స్థాయిలో గల ఊపిరితిత్తులకు అదే చిన్న మోతాదు అధిక అనారోగ్యం కలిగిస్తుంది. చిన్న పరిమాణంలో గల ఊపిరితిత్తుల కారణంగా ఒక గంటలో పెద్దలు ఎంత సంఖ్యలో ఊపిరితీసుకుంటారో దానికన్నా మరింత ఎక్కువ సంఖ్యలో చిన్నారులు ఊపిరి తీసుకుంటారు, కాబట్టి చిన్నారులకే వాయుకాలుష్యం బారినపడే ప్రమాదం అధికంగా ఉంటుంది.

చిన్నారులు దాదాపు తమ అధిక సమయాన్నంతా ఇంట్లోనే గడుపుతారు కాబట్టి వారికే అధిక ప్రమాదం ఉంటుంది. చిన్నారుల శరీరాలు, పెద్దల కన్నా అధికమోతాదులో వాతావరణ విషపదార్ధాలను గ్రహిస్తాయి, శరవేగంగా ఎదుగుతున్న వారి శరీరావయవాలు కాలుష్యకారకాల బారిన అధికంగా పడతాయి. చిన్నారులు సాధారణంగా నేలపై పాకుతూ ఆడుకుంటారు కాబట్టి, కలుషితమైన పరిసరాల బారిన అధికంగా పడతారు, ప్రతీ దానిని చేతితో తాకి నోట్లో పెట్టుకునే అలవాటు కారణంగా విషపదార్ధాలు వారికి సులువుగా సోకుతాయి. తద్వారా ఎన్నో రోగాలు సోకుతాయి, రక్తం స్థాయులు పడిపోవడం, ఆస్త్మా, మరియు ఇతర శ్వాసకోశ సమస్యలు వాటిలో కొన్ని.

వివోసి పెద్దల్లోని ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది. వివోసి వల్ల ఊపిరితిత్తులు లేదా గుండె సంబంధిత అనారోగ్యం కలుగుతుంది. తీవ్రమైన అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ అనారోగ్యాలు వీటివల్ల కలుగుతాయి.

గర్భం అనేది వివోసి బారిన పడకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. విఓసీ వల్ల మహిళల పునరుత్పాదక ఆరోగ్యానికి హాని కలిగి, నెలసరి సమస్యలు తలెత్తుతాయి. తద్వారా తుదకు గర్భంతో ఉన్నప్పుడు వారిలో అధిక రక్తపోటుకు దారితీస్తుంది.

అధికమోతాదుల్లోని విఓసీల వల్ల స్త్రీ పురుషుల్లో పునరుత్పాదకత స్థాయులు దిగజారుతాయి. డ్రై క్లీనింగ్ సాల్వెంట్ పర్చ్లోరోథిలీన్ పాలిండ్లలోకి చొరబడి, ఆ తర్వాత పాలుతాగే చిన్నారిలోకి పాకుతుంది.

అధిక స్థాయిలో విఓసీ బారిన పడటం వల్ల కలిగే దుష్ఫలితాల్లో కొన్ని- గర్భస్రావం, తక్కువ బరువు, జన్మలోపాలు, ఎదుగుదల లోపాలు, మరియు చిన్నారుల్లో కేన్సర్ సోకే ప్రభావం అధికంగా ఉండటం.

విషపదార్ధాల బారిన పడకుండా ఉండాలంటే, చక్కని గాలి వెలుతురు సోకేలా వెంటిలేషన్ ఉండాలి, తేమను మరియు నీటి నష్టాన్ని నియంత్రించాలి, పొగ సులభంగా బయటకు వెళ్లేలా చేసే ఉపకరణాలు వాడాలి. దాదాపు చాలా సందర్భాల్లో, ఇండ్లను సురక్షితంగా, కాలుష్య రహితంగా ఉంచుకోవడానికి సాధారణ నివారణప్రక్రియలు సరిపోతాయి. గృహాలను తిరిగి నిర్మించేటప్పుడు విషతుల్యాల బారిన పడకుండా కట్టుకోవడం ఉత్తమం. కొన్ని సందర్భాల్లో, ఆరోగ్యకరమైన ఇంటి కోసం తక్కువ-ఖరీదుతోనే ఎన్నో మెరుగుదలలు చేసుకోవచ్చు. ఉదాహరణకు, ప్రతీ బాత్ రూమ్, వంటగదికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి, అది లోపలి నుండి తేమను ఉక్కపోతను బయటకు పంపుతుంది. దాంతోపాటు, ఇంట్లో ఏమైనా అనారోగ్య కారకాలున్నాయేమోనని అప్పుడప్పుడు తనిఖీ చేస్తుండాలి.

గ్రీన్ సీల్ గల పెయింట్ ఉత్పత్తులు వాతావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయనే హామీని ఇస్తాయి.ఈ గుర్తు గల పెయింట్లు తప్పక విఓసి కంటెంట్లు, నాన్-ఫ్లాట్ ఫినిష్ కు లీ/100గ్రా దిగువన, ఫ్లాట్ ఫినిష్ కు లీ/50గ్రా దిగువున కలిగి ఉండాలి. ప్రైమర్లు మరియు ఫ్లోర్ పెయింట్లకు గ్రీన్ సీల్ పరిమితి కూడా లీ/100 ఉండాలి, అలాగే రిఫ్లెక్టివ్ వాల్ కోటింగులకు లీ/50గ్రా మార్కు మించకూడదు. దాంతోపాటు తక్కువ విఓసి పరిమాణంలో పెయింట్లను తయారుచేసే తయారీదారులకు విఓసి సర్టిఫికెట్లు జారీ చేయబడతాయి.

లేటెక్స్ అండ్ ఫ్లాట్-ఫినిష్ పెయింట్స్ఆయిల్-ఆధారిత మరియు ఇతర అన్ని పెయింట్స్
తక్కువ-విఓసి పెయింట్< 250 గ్రా ప్రతిలీటరుకు< 380 గ్రా. ప్రతి లీటరుకు
విఓసి-ఫ్రీ పెయింట్<5 గ్రా.ప్రతి లీటరుకు

Write To US - Dev

మాకు వ్రాయండి

 
1 Start 2 Complete